NBK: తండ్రికి బాలకృష్ణ నివాళులు
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:49 AM
టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు మారాయి.
ఎన్టీఆర్ (NTR Death anniversary) వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘట్ వద్ద నందమూరి బాలకృష్ణ (Bala Krishna) , రామకృష్ణ, నందమూరి సుహాసిని, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని కొనియాడారు. నాన్నగారు పేదల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చింది. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు మారాయి. ప్రజల వద్దకు పాలన తీసుకురావటానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు చేశారు. ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వివిధ వర్గాలకు ఎన్టీఆర్ ధైవ సమానంగా నిలిచారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది ఎన్టీఆర్ మాత్రమే. మద్రాసు నగరానికి మంచి నీళ్ళిచ్చిన మహానభావుడు ఎన్టీఆర్’’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కూడా నేటి ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించారు.