పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలయ్య
ABN , Publish Date - Apr 28 , 2025 | 07:13 PM
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మ భూషణ్ (Padmabhushan))అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. పంచె కట్టులో ‘పద్మ’ అవార్డుల వేడుకకి హాజరయ్యారు బాలకృష్ణ. తండ్రి నందమూరి తారకరామారావు అడుగు జాడల్లో ప్రయాణించి నటుడిగా ఎదిగారు బాలయ్య. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతో మందికి సాయం అందిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మ్ఘభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.
కోలీవుడ్ హీరో అజిత్ సైతం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. తాను పద్మ పురస్కారానికి ఎంపికేౖన సమయంలో అజిత్ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ‘‘ఈ శుభవార్తను వినేందుకు నా తండ్రి జీవించి ఉంటే బాగుండుదనిపిస్తోంది. ఆయన ఎంతో గర్వపడేవారు’’ అని పేర్కొన్నారు.