Bala Krishna: కృష్ణవేణి మరణం.. బాలయ్య ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 16 , 2025 | 10:41 AM
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (Krishnaveni)102) ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. 'మనదేశం' (Manadesam) చిత్రంతో నందమూరి తారక రామారావును ఆమె ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ( (Balakrishna), నందమూరి రామకృష్ణ సంతాపం తెలిపారు.
"నందమూరి తారక రామారావు గారి నట జీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణి (Krishnaveni passed away) గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం. కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని బాల కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. (Balakrishna Condolences to Krishnaveni)
“నేడు మన చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మన కుటుంబానికి దైవం నాన్న, నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్రం నిర్మాత శ్రీమతి కృష్ణవేణమ్మ గారు స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆమె సినీ రంగానికి చేసిన సేవలు, వెండితెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతుల్ని పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నాము. మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తున్నాము.”
-నందమూరి రామకృష్ణ
కృష్ణవేణి గురించి ఆసక్తికర విషయాలు..
తెలుగు సినిమా రంగంలో తొలి నిర్మాత కృష్ణవేణి
తెలుగులో అతి పెద్ద పారితోషికం అందుకున్న నటి
బాలనటిగా ‘తుకారాం’ చిత్రంలో నటించిన కృష్ణవేణి
పదవ ఏట అనసూయ చిత్రంలో టైటిల్ రోల్ చేసిన కృష్ణవేణి
1938లో ‘కచదేవయాని’ చిత్రంలో నాయికగా నటించారు.
సుమారు ఇరవై చిత్రాలలో కృష్ణవేణి యాక్ట్ చేశారు.
తన పాటలను తానే పాడుకున్న నట గాయని
1940లో మీర్జాపురం రాజాతో వివాహం. వివాహానంతరం ‘భోజ కాళిదాసు’లో నటించిన కృష్ణవేణి
‘మన దేశం’తో నటుడిగా ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
1947లో విడుదలైన ‘గొల్లభామ’తో గొప్ప గుర్తింపు పొందిన కృష్ణవేణి
1942లో కుమార్తె రాజ్యలక్ష్మీ అనూరాధకు జన్మనిచ్చిన కృష్ణవేణి
తల్లి బాటలో నిర్మాతగా రాణించిన అనూరాధాదేవి
‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి నేపథ్యగానం అందించిన కృష్ణవేణి
ఘంటసాల, రమేశ్ నాయుడును సంగీత దర్శకులుగా పరిచయం చేసిన కృష్ణవేణి
గాయనీ మణులు పి.లీ, జిక్కీలను పరిచయం చేసిందీ కృష్ణవేణే!
త్రిపురనేని గోపీచంద్‌ను సినీ రచయితగా మార్చిన కృష్ణవేణి
1952లో వచ్చిన ‘సాహసం’ నటిగా కృష్ణవేణి చివరి చిత్రం
1957లో చివరిగా ‘దాంపత్యం’ చిత్రం నిర్మించిన కృష్ణవేణి
రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కృష్ణవేణి
ALSO READ: RIP Krishnaveni: అలనాటి అందాల 'గొల్లభామ' కృష్ణవేణి కన్నుమూత