SSMB29: మహేశ్ కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు
ABN , Publish Date - Feb 08 , 2025 | 08:29 AM
సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో నటించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి
మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న 29వ (SSMB29) చిత్రం రాజమౌళి (SS RajaMouli)దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే! ‘ఆర్‌ఆర్‌ఆర్’ సక్సెస్ తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రమిది. ప్రియాంక చోప్రా (Priyanka chopra) ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను (Nana Patekar) సంప్రదించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ విషయమై చిత్ర బృందం ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర వర్గాలు పృథ్వీరాజ్ (pruthviRaj sukumaran) సుకుమార్‌తో చర్చలు జరిపాయని తెలిసింది. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇటీవలే స్పష్టత ఇచ్చారు. ఇది పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే సినిమా. ప్రపంచాన్ని చుట్టేసే అడ్వెంచక్ జర్నీగా ఉంటుంది. మరి దీని కోసం నానాపటేకర్ వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె..ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.