Naga Vamsi: పవన్‌ వస్తే.. మేం రాలేము..

ABN , Publish Date - Feb 28 , 2025 | 11:38 PM

'మ్యాడ్‌ స్వ్కేర్‌' సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ అనుకున్న తేదీకే విడుదలైతే..


'మ్యాడ్‌ స్వ్కేర్‌' (Mad Square) సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) అనుకున్న తేదీకే విడుదలైతే.. తాను నిర్మించిన ‘మ్యాడ్‌ స్వ్కేర్‌’ మార్చి 29న రిలీజ్‌ కాదని   నాగవంశీ స్పష్టం చేశారు. ఆయన మాటాడుతూ ‘‘28న హరిహర వీరమల్లు రిలీజ్‌ కానుంది. 29 మీకు కరెక్ట్‌ డేట్‌’ అనుకుంటున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ప్రొడ్యూసర్‌ స్పందించారు. ‘హరిహర వీరమల్లు'  28న వస్తుందో, లేదోనన్న విషయం సినిమా టీమ్‌ను అడగండి. ఒకవేళ ఆ చిత్రం వస్తుందని చెబితే.. మా సినిమా రాదు’ అని అన్నారు.  

అల్లు అర్జున్‌(Allu Arjun), త్రివిక్రమ్‌ (Trivikram) కాంబోలో సినిమా ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుందన్న రూమర్స్‌పై నాగవంశీ (Naga Vamsi) స్పందిస్తూ.. ఆ సినిమా ఇప్పుడే స్టార్ట్‌ కాదని, ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుందని తెలిపారు. అంతే కాదు డాకు మహారాజ్‌ చిత్రం కలెక్షన్లు తగ్గడానికి కారణం వివరించారు. ఆ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎఫెక్ట్‌ పడింది. అయితే బాలకృష్ణ గారి వల్ల కొన్ని ఏరియాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. రెండు సినిమాలకు ఆశించినంత వసూళ్లు రాలేదు. ఓటీటీలో మాత్రం ఆదరణ రెండు చిత్రాలకు బావుంది.  సోలోగా సినిమాలు రావడం కష్టం’’ అని అన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 11:40 PM