Nagarjuna: నాగ్ 100వ సినిమా... రూ. 100 కోట్లు..!

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:28 PM

కింగ్ నాగార్జున వందో చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఇండస్ట్రీ అంటే నెంబర్ గేమ్. ఏ హీరో ఎన్ని సినిమాలు చేశాడు? ఏ ర్యాంకులో ఉన్నాడు? అనేది పదే పదే చూస్తుంటారు అభిమానులు. ఇక మైల్ స్టోన్ మూవీలకు ఉండే క్రేజ్ అయితే అంతా ఇంతా కాదు. 25, 50, 75,100 వంటి ఆ ప్రాజెక్ట్ లని అత్యంత స్పెషల్ గా చూస్తుంటారు. ప్రస్తుతం అలాంటి కేర్ ను తీసుకుంటున్నాడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచే సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు టాలీవుడ్ మన్మథుడు.


కింగ్ నాగార్జున వందో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ ని అధిగమించగా... ఇప్పుడు నాగార్జున వంతొచ్చింది. కింగ్ నుంచి సోలో సినిమా వచ్చి ఏడాది దాటి పోయింది. 'నా సామి రంగ' (Naa Saami Ranga) త‌ర్వాత సోలో సినిమా ఇంత వ‌ర‌కూ ప్రకటించలేదు. ప్రెజెంట్ కుబేర (Kubera), కూలీ (Coolie) మూవీలతో బిజీగా ఉన్న నాగ్... బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్ట్ కార్తీక్ తో చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'నితం ఓరువానం' అనే సినిమా ద్వారా కార్తీక్ డైరెక్టర్ గా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. బట్ ఇక్కడ మాత్రం సినిమా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు నాగార్జున వందో చిత్రానికి పూరి జ‌గ‌న్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్లే తెలుస్తోంది. కార్తీక్ కూడా కింగ్ కు సూట్ అయ్యేలా అక్కినేని ఫ్యాన్స్ కి గూస్‌ బంప్స్‌ తెప్పించే కథను రెడీ చేశాడట. పైగా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. మరి కార్తీక్ - నాగ్ కాంబో ఫైనలైజ్ అవుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Also Read: MS Dhoni: ధోనీని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 05:28 PM