Nagarjuna: కొడుకు – కోడలి ముందు అలాంటివి చూపించకండయ్యా...
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:43 PM
‘తండేల్’ (Thandel) సినిమాతో నాగచైతన్య (Naga chaitanya) అందుకున్న విజయం పట్ల నాగార్జున (Nagarjuna) ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అభిమానులు ఎక్కువగా సంతోషించినట్టు చెప్పారు.
‘తండేల్’ (Thandel) సినిమాతో నాగచైతన్య (Naga chaitanya) అందుకున్న విజయం పట్ల నాగార్జున (Nagarjuna) ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అభిమానులు ఎక్కువగా సంతోషించినట్టు చెప్పారు. ‘తండేల్’ సక్సెస్ మీట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజయం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 7న మూవీ రిలీజైంది. ఆ రోజు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లాం. అక్కడ సెక్యూరిటీ మా ఫోన్లు తీసుకున్నారు. ఫోన్ దగ్గరే ఉండి ఉంటే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తూ చైతన్య ముఖం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నా. కానీ, వాడు త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మేం బయటకు రాగానే ఫోన్ ఆన్ చేశా. ‘కంగ్రాట్స్ అప్పా..’, ‘కంగ్రాట్స్ డాడీ’ అంటూ రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫ్యాన్స్ నుంచి వరుస మెసేజ్ వచ్చాయి. నాకంటే, చైతన్య కంటే మా ఫ్యాన్స్ శ్రేయోభిలాషులు ఎంత ఆనంద పడుతున్నారో అర్థమైంది’ అని పేర్కొన్నారు. నాగార్జున ప్రసంగానికి ముందు.. ఆయన సినిమాలకు సంబంధించిన ఏవీ ప్రదర్శించారు. అందులో కొన్ని రొమాంటిక్స్ సీన్స్ ఉండడంతో.. ‘‘కొడుకు, కోడలి ముందు అలాంటి వీడియోలు చూపించొద్దు’’ అంటూ నాగార్జున సరదాగా సంభాషించారు.
‘‘అరవింద్ (Allu Aravind) గారు ఆ కథ విన్న వేళా విశేషం, దానికి దర్శకుడిగా చందూని అనుకోవడం, హీరోగా చైతన్యను ఎంపిక చేసుకున్న వేళా విశేషం, చైతన్య.. శోభితను పెళ్లి చేసుకున్న వేళా విశేషం.. సినిమా విషయంలో ఇవన్నీ బాగున్నాయి. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా నిర్మాత అల్లు అరవింద్. ‘గజిని’తో ఆ విజయం అందుకున్నారు. ‘100%లవ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘తండేల్’.. ఇలా మీరు మాకు మూడు విజయాలిచ్చారు. అల్లు– అక్కినేని కుటుంబాలకు బాగా సెట్ అయింది. దర్శకుడు చందూతో నేను సినిమా చేయకపోయినా అతడి ప్రతిభ గురించి నాకు తెలుసు. ‘తండేల్’ ద్వారా చైతన్యలోని నటుడిని బయటకు తీసుకొచ్చాడు’’ అని అన్నారు.