Nag- Dhanush: కుబేర వచ్చేది ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 27 , 2025 | 02:53 PM

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస విజయాలతో మంచి జోరు మీదుంది. ప్రస్తుతం ఆమె ధనుష్‌(Dhanush), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రధారులుగా శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంతో అలరించడానికి సిద్దంగా ఉంది.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస విజయాలతో మంచి జోరు మీదుంది. ప్రస్తుతం ఆమె ధనుష్‌(Dhanush), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రధారులుగా శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంతో అలరించడానికి సిద్దంగా ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేది ఖరారైంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృంలం పోస్టర్‌ విడుదల చేసింది. జూన్‌ 20న (Kubera Release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపారు.

2.jpg

ఈ సందర్భంగా రష్మిక పోస్ట్‌ చేసిన పోస్టర్‌లో నాగార్జున, ధనుష్‌ ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్‌ నటుడు జిమ్‌ షర్బ్‌ కనిపిస్తున్నారు. ఇదొక భిన్నమైన సోషల్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలకూ ఇందులో పెద్దపీట వేసినట్లు అర్థమవుతోంది. పైకి బిచ్చగాడిగా (ధనుష్‌) కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది? అతని నేపథ్యం ఏంటన్నది ఆసక్తికరంగా చూపించబోతున్నారు. నాగార్జున ఇందులో ఈడీ అధికారిగా కనిపించనున్నారని టాక్‌.  రష్మిక నటించిన వరుస సినిమాలు హిట్‌ అవుతున్న నేపథ్యంలో ‘కుబేర’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2025 | 03:02 PM