Naga Vamsi: ఫ్యాన్స్ వేరేది కోరుకున్నారు.. ఎన్టీఆర్‌తో నెక్స్ట్ సినిమా

ABN , Publish Date - Jan 09 , 2025 | 06:26 AM

Naga Vamsi: ప్రముఖ నిర్మాత నాగ వంశీ 'సితార బ్యానర్'లో సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది జనవరి 12న నాగ వంశీ.. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కించిన 'గుంటూరు కారం' సినిమా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాత నాగ వంశీ 'గుంటూరు కారం', 'డాకు మహారాజ్' సినిమాల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

Naga Vamsi about guntur kaaram

గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ అభిమానులకు 14 ఏళ్ల తరువాత 'గుంటూరు కారం' సినిమా రూపంలో ఓ అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది, ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర తారాగణం. గత ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాత.


తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'గుంటూరు కారం' అనే టైటిల్ పెట్టడం వలన ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా అని అభిమానులు ఆశించారు. కానీ అది ప్రోపర్ ఫ్యామిలీ సినిమా కావడంతో, వాళ్లంతా డిజప్పాయింట్ అయ్యారు. అప్పటివరకూ వదిలిన కంటెంట్ కారణంగా ఫ్యాన్స్ కథను వేరేగా ఊహించుకున్నారు. వాళ్లు అనుకున్నదానికి దగ్గరగా ఈ కథ లేకపోవడం వలన కొంత నిరాశ చెందారు. మ్యూజికల్ గా మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది" అని చెప్పారు.


ఇక ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణతో ఒక సినిమా చేసిపెట్టమని బాబీని అడుగుతూ వస్తున్నాను. అది ఇప్పటికీ ఇలా సెట్ అయింది. బాలయ్య బాబును ఈ సినిమా కొత్తగా చూపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తోను ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే చెబుతాను" అని అన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 06:43 AM