Naga Vamsi: బాలయ్య షోలో ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదు.. నాగ వంశీ క్లారిటీ

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:41 AM

Naga Vamsi: నేను ఇటు తారక్ గారి సినిమాలు చూస్తాను, అటు బాలకృష్ణ గారి సినిమాలు చూస్తాను. రేపు మోక్షజ్ఞ వస్తే ఆయన సినిమాలు చూస్తాను, ఎదురు చూస్తాను.

Naga Vamsi clarifies rumours

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ ప్రారంభమైంది. అదే బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈ రచ్చ ఆ కుటుంబాల మధ్య ఎంత ఉందొ తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు మాత్రం పెద్ద పట్టింపు అయ్యింది. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని జనవరి 12న బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్.. బాలకృష్ణ ఆన్‌‌‌స్టాపబుల్ షోకు అటెండ్ అయ్యారు. ఈ వేదికపై చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సరికొత్త వివాదానికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.


ఇటీవలే 'డాకు మహారాజ్' దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత నాగ వంశీ తదితరులు బాలకృష బాలకృష్ణ ఆన్‌స్టాపబుల్ షోకు అటెండ్ అయినా విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. నిర్వాహకులు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమాల పోస్టర్లను ప్రదర్శించారు. కానీ.. బాబీ కెరీర్ లో ఎంతో కీలకమైన జూ. ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాని విస్మరించారు. దీంతో పలువురు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షోలో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన పార్ట్‌ని తీసేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇస్తూ.. "షోలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ జై లవకుశ ప్రస్తావన కానీ రాలేదు. రానప్పుడు దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే బయట ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఏదో ఒక పాత సినిమా జూ. ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ అన్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఇలా వివాదం చెలరేగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఇటు తారక్ గారి సినిమాలు చూస్తాను, అటు బాలకృష్ణ గారి సినిమాలు చూస్తాను. రేపు మోక్షజ్ఞ వస్తే ఆయన సినిమాలు చూస్తాను, ఎదురు చూస్తాను. మాలాంటి వాళ్ళం ఇలాంటి వివాదాల వల్ల బాధపడతామని" అన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 07:58 AM