Naga Chaitanya: పీఆర్ గేమ్‌లోకి ఆలస్యంగా వచ్చా..
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:07 PM
చిత్ర పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీని (Pr team gaming) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతిఒక్కరూ పీఆర్‌లను (Movie Prs) నియమించుకుంటున్నారని Naga chaitanya అన్నారు.
'తండేల్’(Thandel) సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య (Naga chaitanya) ఆసక్తికర విషయాలు చెప్పారు. చిత్ర పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీని (Pr team gaming) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతిఒక్కరూ పీఆర్‌లను (Movie Prs) నియమించుకుంటున్నారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా మనం చేసే ప్రమోషన్స్ వల్లనే సినిమా ఆడియన్స్‌లోకి వెళ్తుందని అన్నారు.
‘‘పీఆర్ గేమ్‌లోకి (PR Game) నేను చాలా ఆలస్యంగా వచ్చాను. సోషల్ మీడియా కూడా అరుదుగా వాడుతుంటా. సినిమా కోసం వర్క్ చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటా. అంతేకానీ నాకు ఈ రాజకీయాలు తెలియవు. నువ్వు ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు తప్పదు. గత రెండేళ్లలో పీఆర్ అనేది ఎక్కువైంది. ప్రతి నెలా సుమారు రూ.మూడు లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పీఆర్ కోసం ఖర్చు పెట్టాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు. పక్కనోడిని తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అది నాకు ఏ మాత్రం అర్థం కాదు. అలా చేయడం కూడా తప్పు. పక్కనోళ్లను ఇబ్బందిపెట్టే బదులు.. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం.. ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహార యాత్రలకు వెళ్లడం చేయొచ్చు కదా’’ అని నాగచైతన్య అన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘తండేల్’ (Thandel) సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించారు. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నాగచైతన్య, సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.