Naga Chaitanya: తారక్‌ నోట.. చైతూ రెస్టరెంట్‌ స్పెషల్స్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:52 PM

అక్కినేని నాగచైతన్య  ‘షోయు’ (Shoyu)పేరుతో ఓ రెస్టరెంట్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అక్కినేని నాగచైతన్య(Naga chaiyanya) ‘షోయు’ (Shoyu)పేరుతో ఓ రెస్టరెంట్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రుచికరమైన వంటకాలను అందించడమే లక్ష్యమని చైతూ అన్నారు.  ‘షోయు’ను ఉద్దేశించి ఇటీవల ఎన్టీఆర్‌ (NTR) చేసిన వ్యాఖ్యలపై చైతూ స్పందించారు. ‘‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జపాన్‌కు వెళ్లిన ఎన్టీఆర్‌.. మా రెస్టరంట్‌ గురించి అక్కడ మాట్లాడారు. హైదరాబాద్‌లోని ‘షోయు’లో జపనీస్‌ ఫుడ్‌ దొరుకుతుందని.. జపనీస్‌ ఫేమస్‌ ఫుడ్‌ సుషీ ఇక్కడ చాలా బాగుంటుందని ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వీడియో చూసి ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించింది’’ అని చైతన్య అన్నారు.

‘‘ప్రీమియం క్లౌడ్‌ కిచెన్‌ పెట్టాలని లాక్‌డౌన్‌లో ఆలోచన వచ్చింది. అలా పుట్టిందే మా రెస్టరంట్‌. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా నడస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘తండేల్‌’తో సక్సెస్‌ అందుకున్నారు నాగచైతన్య. ప్రస్తుతం కార్తిక్‌ వర్మ దండుతో ఓ సినిమా చేస్తున్నారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ఈ మూవీగా ఇది సిద్థం అవుతుంది. భారీ వీఎఫ్‌ఎక్స్‌ హంగులతో దీనిని రూపొందించనున్నామని అన్నారు.



 

Updated Date - Apr 25 , 2025 | 03:55 PM