Naga Chaitanya Sobhita Dhulipala Love: చైతన్యను తొలిసారి చూసిన శోభితా.. కెమిస్ట్రీ మాములుగా లేదు
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:21 AM
ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్. తాజాగా 'తండేల్' సినిమా రిలీజ్ నేపథ్యంలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బయటపడింది.
శుక్రవారం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా రిలీజై మంచి స్పందనను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా కోసం నాగ చైతన్య కొన్ని నెలలుగా గడ్డం తీయలేదు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ కావడంతో ఆయన షేవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య వైఫ్, నటి శోభితా ధూళిపాళ్ల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రొమాంటిక్ పోస్ట్ ఒకటి షేర్ చేశారు. దీనికి చైతన్య కూడా మరింత రొమాంటిక్ గా రిప్లై ఇవ్వడంతో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
తండేల్ సినిమా రిలీజ్ నేపథ్యంలో శోభితా ధూళిపాళ్ల పోస్టు చేస్తూ.. ‘‘ఈ సినిమా మేకింగ్ సమయంలో మీరు చాలా ఫోకస్, పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లీ గడ్డం షేవ్ చేశావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’’ అని రాసుకొచ్చారు. దీనికి చైతన్య రిప్లై ఇస్తూ.. ‘‘థాంక్యూ బుజ్జితల్లి’’ అని రీ షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ వీరి కెమిస్ట్రీని చూసి మురిసిపోతున్నారు.
ఇంతకు ముందు వీళ్ళ లవ్ స్టోరీ గురించి శోభితా చెబుతూ.. "2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. ‘నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపరించింది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను పెట్టే గ్లామర్ ఫొటోలు కాకుండా .. స్ఫూర్తిమంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లకు నాగచైతన్య లైక్ చేసే వారు’. మొదటిసారి ముబైలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిశా. అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటి నుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే. న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ కోసం నాగచైతన్య కుటుంబం నన్ను ఆహ్వానించారు ఆ మరుసటి సంవత్సరం చైతన్య నా కుటుంబాన్ని కలిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు.