Naga Chaitanya: శోభిత నిర్ణయం తర్వాతే ఏదైనా..
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:06 PM
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన భార్య శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) పై పొగడ్తల వర్షం కురిపించారు. తనతో అన్ని విషయాలు పంచుకుంటానని చెప్పిన ఆయన కీలక విషయాల్లో అయోమయానికి లోనైన సమయంలో ఆమె ఎంతో సపోర్ట్‌గా నిలుస్తుందని సరైన సూచనలు కూడా ఇస్తుందని చెప్పారు.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన భార్య శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) పై పొగడ్తల వర్షం కురిపించారు. తనతో అన్ని విషయాలు పంచుకుంటానని చెప్పిన ఆయన కీలక విషయాల్లో అయోమయానికి లోనైన సమయంలో ఆమె ఎంతో సపోర్ట్‌గా నిలుస్తుందని సరైన సూచనలు కూడా ఇస్తుందని చెప్పారు. తండేల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ ‘‘శోభితతో జీవితాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. నా ఆలోచనలన్నింటినీ ఆమెతో చెబుతుంటా. నేను ఎప్పుడైనా కన్‌ఫ్యూజన్‌కి గురైనప్పుడు ఆమెను సంప్రదిస్తా. కాస్త ఒత్తిడికి లోనైనా తనకు తెలిసిపోతుంది. ‘ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అని అడుగుతుంది. అన్ని విషయాల్లో తను నాకు గొప్ప సలహాలు, సూచనలు ఇస్తుంది. ఆమె అభిప్రాయాలు న్యూట్రల్‌గా ఉంటాయి. ఆమె నిర్ణయాన్ని నేను ఎంతగానో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుంది’’ అని చైతన్య అన్నారు.
చైతన్య, శోభిత స్నేహితులుగా ఉండి ఆపై ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ‘‘చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగింది అంతా అందరికీ తెలుసు’’ శోభిత అన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయిపల్లవి కథానాయిక. ఫిబ్రవరి 7న ఇది విడుదల కానుంది.
READ MORE: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ దోప్ సాంగ్ ఫుల్ వీడియో