Naga Chaitanya: సమంతతో  విడాకులు.. ముక్కుసూటిగా ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 09:55 AM

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య (Naga Chaitanya) సమంతతో (Samantha) విడాకుల గురించి మరోసారి స్పందించారు. వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Naga Chaitanya

'తండేల్‌' (Thandel) చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు నాగచైతన్య. అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న హిట్‌తో వారిలో పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. సినిమా మంచి ఓపెనింగ్స్‌తో ముందుకెళ్తుంది.  ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య (Naga Chaitanya) సమంతతో (Samantha) విడాకుల గురించి మరోసారి స్పందించారు. వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Naga-chaitanya.jpg

‘‘నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చానో అందరికీ తెలుసు. పెద్ద ఫ్యామిలీ అయినా నేనూ ఒక విడిపోయిన కుటుంబం నుంచి వాడినే. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి సందర్భంలో నిర్ణయం తీసుకోవాలంటే  1000 సార్లు ఆలోచించాలి. సమంతతో  విడిపోవాలనుకున్నట్లు (SamanthaPrabhuDivorce) ఇద్దరం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అదే ప్రకటించాం. 'వేర్వేరు మార్గాల్లో వెళ్లాలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు' అని రిక్వెస్ట్‌ చేశాం. మేం ఇచ్చిన మెసేజ్‌ మీడియాకు, నెటిజన్లరు ఓ హెడ్‌లైన్‌ అయిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న పెయిన్‌ మరచిపోయి దానిని ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకున్నారు. మేం ఏమీ ఓవర్‌ నైట్‌  నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారి చూసుకున్నాం.  ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. ఏం జరిగిన దానికంటూ ఓ కారణం ఉంటుంది. గత మూడేళ్లగా ఈ టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ సమాధానం చెబుతూనే ఉన్నా. కానీ ఎక్కడా ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ఎన్నిసార్లు మాట్లాడినా, వివరణ ఇచ్చినా రాసేవాళ్లు రాసుకుంటేనే ఉంటారు. ఎవరైతే ఈ ట్రోలింగ్‌ చేస్తూ, కథనాలు సృష్టిస్తున్నారో వారు నా గురించి ఆలోచించడం కాకుండా వారి లైఫ్‌ మీద టైమ్‌ ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుందేమో’’ అని అన్నారు నా చైతన్య. ప్రస్తుతం నాకంటూ ఓ లైఫ్‌ ఉంది. ఎంతో ఆనందంగా ఉంది’’ అని చై అన్నారు. (Naga Chaitanya About Samanth Divorce)
 


Naga-chaitanya-2.jpgట్రెండింగ్ లో తండేల్ (Thandel Trending)
నాగచైతన్య సాయి పల్లవి నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తండేల్‌’ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకొని మంచి వసూళ్లతో ముందుకెళ్తుంది. ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ‘అలలు మరింత బలపడుతున్నాయి’ అని క్యాప్షన్‌ పెట్టింది. బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా ‘తండేల్‌’ టికెట్స్‌ అమ్ముడయ్యాయి. అలాగే ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సంస్థ తెలిపింది.   

Updated Date - Feb 08 , 2025 | 09:56 AM