Naga chaitanya 24: సైలెంట్‌గా మొదలెట్టేశాడు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:58 PM
తండేల్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చైతన్య తదుపరి చిత్రం విషయంలోనూ ఓ ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పటికే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. చైతన్యకు 24వ సినిమా ఇది.
'తండేల్' (Thandel) సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న చైతన్యకు ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కాస్త ఊరట కలిగించింది. మంచి కమ్‌బ్యాక్ అయింది. తండేల్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చైతన్య తదుపరి చిత్రం విషయంలోనూ ఓ ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పటికే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. చైతన్యకు 24వ (Naga Chaitanya 24) సినిమా ఇది. గతేడాది చైతూ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే మైథలాజికల్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా మొదలైనట్టు తెలుస్తోంది. ఇటీవ సినిమాను మొదలు పెట్టి నాలుగు రోజులు చిత్రీకరణ కూడా చేశారట. త్వరలోనే మరో ఎన్‌సీ24కు సంబంధించిన మరో షెడ్యూల్ మొదలు కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి వృషకర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. దీంతోపాటు మరికొన్ని టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారు దర్శకుడు. విరూపాక్ష సినిమాకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించనుండగా, సినిమా షూటింగ్ అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని తెలిసింది.