Kalki 2898 AD: కల్కి-2పై దర్శకుడు అదిరే అప్‌డేట్‌..

ABN , Publish Date - Mar 18 , 2025 | 07:10 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 Ad) సక్సెస్‌ తర్వాత దాని కొనసాగింపుగా వచ్చే ‘కల్కి2’ (Kalki2) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పార్ట్‌-2 దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ప్రభాస్‌ (Prabhas) హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 Ad) సక్సెస్‌ తర్వాత దాని కొనసాగింపుగా వచ్చే ‘కల్కి2’ (Kalki2) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పార్ట్‌-2 దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కల్కి సినిమా తక్కువ టైమ్‌లో తీసే సినిమా కాదు. పెద్ద క్యాస్టింగ్‌, సీజీ వర్క్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోంది. అసలు ప్రాజెక్ట్‌-కె అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. అది పూర్తయిన దాని బట్టి షూటింగ్‌ మొదలు పెడతాం. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ‘కల్కి’లో మహాభారతం నేపథ్యాన్ని సెట్‌ చేసుకుని, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్‌ చేసుకుని ఇక్కడదాకా వచ్చాం. ప్రభాస్‌ నిడివి పార్ట్‌2లో కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్‌లోనే కథ సాగుతుంది. రెండో భాగంలో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. దీనికి చాలా వర్క్‌ చేయాల్సి ఉంది. విడుదల తేదీపై ప్రస్తుతం స్పందించలేను. ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని కథలతోనే సినిమాలు చేశా’’ అని అన్నారు.

ప్రస్తుతం ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఏ హీరో చేయనన్ని  ప్రాజెక్ట్‌లతో ప్రభాస్‌ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణ దశలో ఉన్నాయి. దాంతోపాటు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ త్వరలోనే మొదలుకానుంది. ఇది కాకుండా ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌2: శౌర్యంగ పర్వం’, ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘స్పిరిట్‌’ మూవీ స్ర్కిప్ట్‌ లాక్‌ అయింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు సందీప్‌ భావిస్తున్నారు. కల్కి-2 ఈ ఏడాది చివర్తో సెట్స్‌ మీదకెళ్లే అవకాశం ఉంది. 

Updated Date - Mar 18 , 2025 | 07:13 PM