Santhana prapthirasthu: నాలో ఏదో.. లిరికల్ సాంగ్ వచ్చేది అప్పుడే.. 

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:27 PM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'.  మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

విక్రాంత్, చాందినీ చౌదరి (Chandini) జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana prapthirasthu).  మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా 'ఏబీసీడీ' సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీ గా ఉంది చిత్ర బృందం. ఈ నెల 26వ తేదీన ఫస్ట్ సింగిల్  'నాలో ఏదో..' రిలీజ్ చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ కంపోజిషన్ లో హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా 'నాలో ఏదో..' పాటను చిత్రీకరించారు. ఈ పాటకు శ్రీజో లిరిక్స్ అందించారు. సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు ఆలపించారు.  ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన "సంతాన ప్రాప్తిరస్తు" టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  

Updated Date - Mar 23 , 2025 | 03:30 PM