Mythri Movie Makers: మైత్రీ లైన్ అప్.. మామూలుగా లేదు...
ABN , Publish Date - Feb 27 , 2025 | 02:01 PM
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రాబోయే రెండేళ్ళలో పదిహేనుకు పైగా చిత్రాలను విడుదల చేయబోతోంది. అందులో పలు చిత్రాలు ఇప్పటికే సెట్స్ పై ఉండగా, మరికొన్ని వచ్చే యేడాది మొదలు కానున్నాయి.
ఇవాళ భారతీయ సినిమా పరిశ్రమ తెలుగు వైపు దృష్టి సారిస్తే... ప్రముఖ తెలుగు నిర్మాతలు పరభాషా చిత్రాల నిర్మాణంపై పోకస్ పెట్టారు. అందులో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ మరింతగా దూకుడు ప్రదర్శిస్తోంది. 'పుష్ప-2' (Pushpa -2) ఘన విజయంతో గత యేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఈ సంస్థ ఏకంగా డజనుకు పైగా చిత్రాలు నిర్మిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్ బాబు (Mahesh Babu) 'శ్రీమంతుడు' సినిమాతో ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. అక్కడ నుండి ఎన్నో అఖండ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం 'రాబిన్ హుడ్' మార్చి 28న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమాను నిర్మిస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ నాయిక. అలానే చెర్రీతోనే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో మరో సినిమా నిర్మించబోతోంది. ప్రభాస్ (Prabhas) కథానాయకుడుగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' మూవీని నిర్మిస్తోంది. 'కేజీఎఫ్'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీశ్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ని ప్రొడ్యూస్ చేస్తోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో మూవీని నిర్మిస్తున్న ఈ సంస్థ నాని- తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి తోనూ సినిమా ప్లాన్ చేస్తోంది. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ లో '8 వసంతాలు' మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi), బాబీ కొల్లి కాంబోలో 'వాల్తేరు వీరయ్య'ను నిర్మించి గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న ఈ సంస్థ ఇదే కాంబోను రిపీట్ చేయబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో 'జై హనుమాన్' తీస్తోంది. అలానే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమాను నిర్మిస్తోంది.
AlSO READ: Arrest: పోసాని వికెట్ అవుట్... నెక్ట్స్ ఎవరు...
పరభాషల్లోనూ పలు చిత్రాలు
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ థింక్ బిగ్ అనే పాలసీని ఫాలో అవుతోంది. అంచలంచెలుగా తన నిర్మాణ సామ్రాజ్యాన్ని విస్తరింప చేస్తూ, పంపిణీ రంగంలోకీ అడుగుపెట్టింది. తెలుగుతో పాటు పరభాషా చిత్రాలను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఇప్పటికే దక్షిణాది చిత్రసీమల్లో అడుగు పెట్టేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అజిత్ (Ajith) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న వస్తోంది. అదే రోజున ఈ సంస్థ సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేనితో నిర్మించిన హిందీ చిత్రం 'జాట్' ని జాతీయ స్థాయిలో విడుదల చేస్తోంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా 'నడిగర్ తిలగం' మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, 'లవ్ టుడే' (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ నిర్మాణంపై చర్చలు జరుపుతోంది. ఆ రకంగా రాబోయే రెండేళ్ళలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు 15 సినిమాలను జనం ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది.
ALSO READ: Shruti Haasan: ఆసక్తిరేకెత్తిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐ' ట్రైలర్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి