Mythri Producers: ఒక్కో సినిమా..  ఒక్కో లెవల్‌.. నిర్మాత మాటలు ఇంకో లెవల్‌..

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:38 PM

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రస్తుతం టాప్‌ గేర్‌లో ఉంది. ‘పుష్ప’తో మైత్రీ భారీ లాభాలు సంపాదించింది.  చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది.


మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ (Mythri Movie makers) ప్రస్తుతం టాప్‌ గేర్‌లో ఉంది. ‘పుష్ప’తో మైత్రీ భారీ లాభాలు సంపాదించింది.  చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తోందీ సంస్థ. ఈ ఏడాది అయితే ఈ సంస్థ నుంచి ఆరు భారీ చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. రామ్‌ చరణ్‌(Ram charan), ప్రభాస్‌(Prabhas), ఎన్టీఆర్‌ (NTR) సినిమాలతోపాటు జై హనుమాన్‌ కూడా విడుదల కాబోతోంది. ఇవి కాకుండా పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, విజయ్‌ దేవరకొండ సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ఇవన్నీ ‘బ్లాక్‌ బస్టర్‌’ చిత్రాలే అని మైత్రీ నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్‌ దీమాగా చెబుతున్నారు.



"వచ్చే ఏడాది మా సంస్థ నుంచి మా సంస్థలో ఆరు సినిమాలొస్తున్నాయి. మాకెంతో ప్రత్యేకమైన సంవత్సనం ఇది. అన్నీ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలే(All Are block busters) A. ‘మామూలు హిట్‌’ అన్న మాట వినిపించినా నా మాటలు నమ్ శంకర్‌ స్ర్కిప్ట్‌ లాక్‌ చేశాడు. పవన్‌ కల్యాణ్‌ గారి సినిమా అంటే ఏ పాన్‌ ఇండియా బజ్‌ సరిపోదు’’ అంటూ 2026 చిత్రాల గురించి చెప్పారు రవి.

Updated Date - Mar 27 , 2025 | 12:53 PM