Thaman: పెళ్లి చేసుకోకండి.. తమన్ సెన్సేషనల్ కామెంట్స్
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:57 AM
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మాటలతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నేటి తరం యువత గురించి మాట్లాడుతూ.. తనదైన స్టైల్‌లో మార్గదర్శం చేశాడు.
ఇప్పుడే సినిమాకు విన్నా.. సంగీత దర్శకుడు తమన్ పేరే వినబడుతోంది. మ్యాగ్జిమమ్ స్టార్ హీరోలందరి చిత్రాలకు తమన్ వాయిస్తున్నాడు. అంత బిజీగా ఉన్నా కూడా ఎప్పుడూ వర్క్ టెన్షన్‌ని తన ఫేస్‌లో కనబడనివ్వకుండా.. నవ్వుతూ ఉండే తమన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లైఫ్ స్టైల్, స్ట్రెస్ గురించి మాట్లాడాడు. అలాగే నేటి తరం గురించి మాట్లాడుతూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తమన్ మాట్లాడుతూ.. 'ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెండెట్ అయ్యారు.. ఒకరి మీద వాళ్లు బతకాలని అనుకోవడం లేదు.. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది.. ఇన్‌స్టాగ్రాం వాడకం ఎక్కువైంది.. జనాల మైండ్ సెట్ మారింది.. కలిసి ఉండే ఆలోచనాధోరణి మారిపోయింది.. పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే విడిపోతోన్నారు.. అందుకే నేను ఈ పెళ్లిళ్లు ఇప్పుడు వేస్ట్ అంటున్నాను.. నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం పెళ్లి వద్దు అనే అంటాను' అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి క్యాంపులకు తల సేమియా వ్యాధి గ్రస్తుల చికిత్స కోసం తమన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 15న విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించనున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "లైఫ్ లో దేన్నైనా నిలబెట్టవచ్చు. ట్రస్ట్ ను నిలబెట్టడం చాలా కష్టం. ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు ఎంతోమందికి స్పూర్తివంతులు. వారు స్థాపించిన ట్రస్ట్ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేసిన అభివృద్ధి ఏంటో మనం చూశాం. ఫిబ్రవరి 15న విజయవాడ లో జరిగే ఈవెంట్ లో ఎన్టీఆర్ గారి ఉత్తమ పాటలు ఉంటాయి. మా టీమ్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నాం" అని తమన్ అన్నారు.