Mumait Khan: రూటు మార్చిన ముమైత్ ఖాన్
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:28 PM
ఒకప్పటి క్రేజీ ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మరో రంగంలో తనదైన ముద్రను వేసే పనిలో పడింది ముమైత్ ఖాన్.
బ్యూటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ప్రముఖ నటి, నృత్యతార ముమైత్ ఖాన్ (Mumait Khan). కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాజాగా యూసఫ్ గూడాలో తన బ్రాంచ్ ను ప్రారంభించింది. బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెల్ నెస్ లో నైపుణ్యం పెంచేందుకు ఈ సంస్థ కృషి చేయబోతోంది.
బ్యూటీ పరిశ్రమపై మక్కువ ఉన్న వారిని ప్రోత్సహించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశామని, ఈ రంగంపై అవగాహన కల్పించడంతో పాటు బ్రైడల్ అండ్ హెయిర్ మేకప్ తో ట్రైనింగ్ ఇవ్వబోతున్నామని, విద్యార్థులను ప్రపంచ స్థాయిలో ట్రైయిన్డ్ స్పెషలిస్టులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముమైత్ ఖాన్ చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ముమైత్ ఖాన్ తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి (Jyothi), అక్సాఖాన్ (Aksa Khan) , సింగర్ రోల్ రైడా (Roll Rida), డాన్స్ మాస్టర్ జోసఫ్ (Joseph) తదితరులు పాల్గొన్నారు.