Grok: గ్రోక్ ను ఆశ్రయించిన కుర్ర హీరోలు!
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:30 AM
ఎలాన్ మాస్క్ కు చెందిన గ్రోక్ ఎ.ఐ. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాంతో తెలుగు యువ కథానాయకులు సైతం దాని ద్వారా తమ చిత్రాల ప్రమోషన్స్ చేసేస్తున్నారు.
ఈ నెల 20న 'రాబిన్ హుడ్' (Robinwood), 'మ్యాడ్ స్క్వేర్ (Madsquare)' చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇదే వీకెండ్ కు తమిళ అనువాద చిత్రం 'వీర ధీర శూరన్ -2', మలయాళ అనువాద చిత్రం 'ఎల్ 2: ఎంపురాన్' కూడా వస్తోంది. విశేషం ఏమంటే... స్ట్రయిట్ రెండు తెలుగు సినిమాల ప్రమోషన్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. 'మ్యాడ్ స్క్వేర్' సందడి ఈ మధ్య కాలంలో కాస్తంత తగ్గడంతో ఆ మూవీ ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యిందేమో అనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేశారు. కానీ సోమవారం గ్రోక్ (Grok) ద్వారా తమ చిత్రం రిలీజ్ డేట్ ను కుర్రహీరోలు కన్ ఫర్మ్ చేసేశారు. ఈ మూవీకి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను గ్రోక్ సాయంతో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో ఓ ఫన్నీ వీడియో చేసి జనాల మీదకు వదిలారు.
ఇదిలా ఉంటే... గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎలాన్ మాస్క్ గ్రోక్ హడావుడే బాగా కనిపిస్తోంది. దానిని తమ మూవీ పబ్లిసిటీకీ 'రాబిన్ హుడ్' హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల వాడేశారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు మంచి డేట్ ను సజెస్ట్ చేయమని గ్రోక్ ను అడిగితే... దాని నుండి ఎలా సమాధానం వచ్చిందో వీళ్ళూ ఓ వీడియో ద్వారా తెలిపారు. మొత్తానికి మార్చి 21 సాయంత్రం 4.5 నిమిషాలకు ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. మొత్తానికి గ్రోక్ ను మనవాళ్ళు భలేగా ఉపయోగించేసుకుంటున్నారని నెటిజన్స్ అంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో కామెడీ సృష్టించడం వరకూ బాగానే ఉంది... అయితే సినిమాలో విషయం ఉంటేనే అది జనాలను రీచ్ అవుతుందనే విషయాన్ని మన మేకర్స్ గుర్తిస్తే బాగుంటుంది.
Also Read: Jyothi Raj: రోత స్టెప్పును రీ-క్రియేట్ చేయొద్దు ప్లీజ్!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి