Daksha: ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:37 PM
మంచు లక్ష్మీ ప్రసన్న , మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'దక్ష'
మంచు లక్ష్మీ ప్రసన్న(Lakshmi Prasanna), మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'దక్ష' (Daksha). మంచు ఎంటర్ టైన్మెంట్, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు డా. విశ్వామిత్రగా కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం అయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని అయన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్తాన్ని మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తుండగా అచ్చు రాజమని అంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.