Mohan Babu: రంగారెడ్డి కోర్టుకు మోహన్ బాబు

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:55 PM

Mohan Babu: మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ విచారణ చేపట్టింది.

మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సమయంలో కూడా వారి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయి. అయితే తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ ఖాళీ చేయించాలంటూ రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉండగా.. మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.


అలాగే పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు కలెక్టర్. ఈ నోటీసుల మేరకు మనోజ్ ఇప్పటికే రంగారెడ్డి సబ్ కలెక్టర్ ఎదుట విచారణకు తొలిసారి హాజరయ్యారు. తమవి ఆస్తి గొడవలు కాదని, తమ విద్యాసంస్థలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినదుందుకు ఆస్తి గొడవలుగా ప్రచారం చేస్తున్నారని అప్పట్లో మనోజ్ చెప్పారు. కుటుంబసభ్యులు అంతా కూర్చుని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చొప్పినా ఎవరూ కూడా స్పందించడం లేదని మనోజ్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు రంగారెడ్డి సబ్‌కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు మోహన్‌ బాబు. అలాగే మనోజ్‌ కూడా మరోసారి విచారణకు వచ్చారు.

Updated Date - Feb 03 , 2025 | 09:54 PM