Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్.. పరస్పర దూషణలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:17 PM

Mohan Babu Vs Manchu Manoj: సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విచారణకు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్రంగా మండిపడ్డారు.

Mohan Babu

మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిగింది. ఈ విచారణకు మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో మోహన్ నన్ను ఆసక్తికర ఆరోపణలు చేశాడు. మరోవైపు మంచు మనోజ్ ఫైర్ మీద కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..


తాజాగా రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో జరిగిన విచారణలో మోహన్ బాబు తన వాదనలు వినిపిస్తూ.. తల్లి తండ్రులు, వృద్ధులు, సంరక్షన చట్టం కింద భద్రత కల్పించాలని కోరారు. తన ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించడాని కలెక్టర్ కు తెలియజేశాడు. అలాగే తన ఆస్థులు కాపాడాలని కోరారు. సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తులపై ఎవరికీ హక్కు ఉండదన్నారు. మనోజ్.. నా ఆస్తులు నాకు అప్పగించాలని కోర్టు ముందు డిమాండ్ చేశాడు మోహన్ బాబు. కాగా ఈ విచారణ సుమారు రెండు గంటల పాటు సాగింది.


అనంతరం.. మేజిస్ట్రేట్ ముందే.. మనోజ్ & మోహన్ బాబు పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. ఆస్తి తగదాకి సంబంధించి కలెక్టర్ కు పూర్తి వివరాలు అందజేసి కలెక్టర్ కార్యాలయం నుండి వెనుదిరిగారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు. ఆయన తీవ్ర ఆవేశంతో కనిపించాడు. కాగా తదుపరి విచారణను మేజిస్ట్రేట్ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Updated Date - Feb 03 , 2025 | 06:21 PM