Mimoh chakraborty: 'నేనెక్కడున్నా...' అంటున్న మిధున్ చక్రవర్తి కొడుకు

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:44 PM

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి (Sasha Chettri) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నేనెక్కడున్నా' (Nenekkadunna). కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి (Sasha Chettri) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నేనెక్కడున్నా' (Nenekkadunna). కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ (Madhav Kodad) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajedra) చేతుల మీదుగా 'నేనెక్కడున్నా' ట్రైలర్ విడుదలైంది.

Mithun.jpeg

ట్రైలర్ విడుదల అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... "జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు కె.బి.ఆర్, మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నా శుభాకాంక్షలు" అని అన్నారు. 'నేనెక్కడున్నా' సినిమాలో ఆనంద్ పాత్రలో మిమో చక్రవర్తి, ఝాన్సీగా సశా చెత్రి నటించారు. వాళ్లిద్దరూ జర్నలిస్ట్ రోల్స్ చేశారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాల కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్న ఆనంద్, ఝాన్సీ చేసిన కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయట పడతాయి. ఆ తర్వాత ఏమైంది? ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నారు? అనేది సినిమా కథ.

Updated Date - Feb 15 , 2025 | 05:13 PM