Chiranjeevi: చిరంజీవి ఆ కథ వదిలేయడమే మంచిదా..

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:03 PM

ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం ఈ సినిమాను చిరంజీవి (Chiranjeevi Rejects Mazaka story) వదిలేయడమే మంచిదని కొందరు చెబుతున్నారు. అందుకూ ఓ కారణం ఉంది.


సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) నటించిన తాజా చిత్రం ‘మజాకా’ (Mazaka) ఈ శుక్రవారం విడుదల కానుంది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మించిన ఈ చిత్రానికి బజ్‌ బాగానే ఉంది. సందీప్‌ కెరీర్‌కు మంచి భరోసా ఇచ్చే చిత్రంగా చెబుతున్నారు.  తండ్రీ కొడుకుల కథ ఇది. ఇద్దరూ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది సబ్జెక్టు. అయితే ఈ కథ ముందుగా చిరంజీవి (Chiranjeevi) దగ్గరకు వెళ్లింది. తండ్రిగా చిరంజీవి, కొడుకుగా సిద్దు జొన్నలగడ్డను కలిపి ఈ సినిమా చేద్దామనుకొన్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయిన’ ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. దాదాపుగా సెట్‌ మీదకు వెళ్లాల్సిన ప్రాజెక్ట్‌ ఇది. కానీ ఎక్కడో ఫుల్‌స్టాప్‌ పడింది. దాంతో చిరు ఫ్యాన్స్‌ కాస్త నిరాశ పడ్డారు. చిరు  సిద్దు పండించే ఫన్‌ చూడాలని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు.  

ALSO READ: Rakul Preet Singh: ఆయన పక్కన లేకపోతే... అందుకే అలా చేశా..


అయితే ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం ఈ సినిమాను చిరంజీవి (Chiranjeevi Rejects Mazaka story) వదిలేయడమే మంచిదని కొందరు చెబుతున్నారు. అందుకూ ఓ కారణం ఉంది. ఇందులో తండ్రి పాత్ర చిరంజీవి స్థాయికి సరిపోదట. ఈ విషయాన్ని సందీప్‌ కిషన్‌ స్వయంగా తెలిపారు. దర్శకుడిదీ ఇదే మాట. ’’చిరంజీవి గారి దగ్గరకు ఈ కథ వెళ్లిన మాట వాస్తవం. అయితే ఆ వెర్షన్‌ ఎలాంటిదో నాకు తెలీదు. రావు రమేష్‌ ఇమేజ్‌కీ, ఆయన వయసుకీ తగ్గ పాత్ర ఇది. ఎంతైనా చిరు ఇమేజ్‌ వేరు కదా, ఆయన ముందు కథ చిన్నదైపోతుంది’’ అని చెప్పారు దర్శకుడు. త్రినాధరావు నక్కిన. హీరో సందీప్‌ కిషన్‌ కూడా ఇలాగే చెప్పారు. అయితే కొన్ని కథలు బావుండొచ్చు. కానీ ఆ పాత్రకు యాప్ట్‌ అయ్యే  ఆర్టిస్ట్‌లను తీసుకోవడమే కరెక్ట్‌ అవుతుంది. అయితే ఇందులో రావు రమేష్‌ పాత్రలో చిరుని ఊహించుకోలేం. ఎవరి ఇమేజ్‌ వారిది. అందుకే చిరంజీవి కూడా ఈ కథను తిరస్కరించి ఉంటారని టాక్‌ నడుస్తోంది. 

ALSO READ: Anupam Kher: నియమ నిబంధనలు తెలుసు.. అయినా ఎందుకిలా..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Feb 25 , 2025 | 12:05 PM