Mega Vs Allu: ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు..

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:15 PM

Mega Vs Allu: ఎన్ని సార్లు కొట్టిన చావని పాములు కొన్ని ఉంటాయి. వాళ్లే హీరోల టాక్సిక్ ఫ్యాన్స్. సోషల్ మీడియా తిన్నది అరగక  అనవసరంగా విషం కక్కుతూ తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటి పేర్లను, ఒంటి పేర్లను మర్చిపోయి. జ్ఞానం అనే ప్రపంచానికి సూదూర ప్రాంతాల్లో జీవిస్తుంటాయి.

mega vs allu

ఎన్ని సార్లు కొట్టిన చావని పాములు కొన్ని ఉంటాయి. వాళ్లే హీరోల టాక్సిక్ ఫ్యాన్స్. సోషల్ మీడియా తిన్నది అరగక  అనవసరంగా విషం కక్కుతూ తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటి పేర్లను, ఒంటి పేర్లను మర్చిపోయి. జ్ఞానం అనే ప్రపంచానికి సూదూర ప్రాంతాల్లో జీవిస్తుంటాయి. మిడి మిడి జ్ఞానం కాదు.. నీచమైన జ్ఞానంతో సోషల్ మీడియాలో చెలరేగుతూ ఉంటారు. వీళ్ళు ఒక్క హీరో,  ఒక్క ఫ్యామిలీకే కాదు. అందరు హీరోలకు, అందరికి కుటుంబాలకు ఉంటారు. తాజాగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో కొందరు విషం కక్కుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


సినిమాపై విశ్లేషణ, రివ్యూ, క్రిటిసిజం, రోస్ట్, ట్రోలింగ్  ఆహ్వానించదగినవే. కానీ.. పరిమితులు ఉంటాయి.  ప్రస్తుతం పరిమితులు, ఆ పదాలకు అర్థం తెలిసిన వారు అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు బాహ్య ప్రపంచంలో తెలిసినవారు చాలా అరుదు. దీంతోనే అసలు సమస్య ఎదురువుతుంది. ఒక డిస్ట్రబుడ్, టాక్సిక్ స్పేస్ ఏర్పడుతుంది. దీంతో డబ్బు ఉన్నోడికి ఎలాంటి సమస్య ఏర్పడదు. వాళ్ళు ఆ వలయం నుంచి ఎప్పుడు దూరంగానే ఉంటారు. ఇందులో కొట్టుకు, చనిపోయేది మాత్రం సో కాల్డ్‌ ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ముగిసింది అనుకున్న.. మెగా వర్సెస్ అల్లు యుద్దానికి సోషల్ మీడియా వేదిక మరోసారి తెరలేపింది. ఇందులో ఎవరి ఫ్యాన్స్ తక్కువ, ఎక్కువ కాదు, అందరు సబ్జెక్టివ్. 


'పుష్ప 2' గ్రాండ్ సక్సెస్ అందుకుంది. రూ. 1800 కోట్ల మార్కుని దాటేసింది(వాస్తవానికి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక బయటి వ్యక్తి ఏది ఒరిజినల్ కలెక్షన్, ఏది డూప్లికేట్ అని తేల్చే స్థితిలో లేడు). ఇది అన్ని సినిమాల విషయంలో జరుగుతున్న విషయమే. తాజాగా ఓ అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకునే ఓ వ్యక్తి  సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ పెద్ద కటౌట్ కింద రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిన్న కటౌట్ కనిపిస్తుంది. దీని బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహావిష్కరణ సీన్ తో పోల్చి ఓ కొత్త యుద్దానికి తెర తీశారు.దీంతో ఇరువర్గాల అభిమానులు హీరోల ఫ్యామిలీల కోసం తమ ఫ్యామిలీలలోని స్త్రీల అంగాలను ఇన్వాల్వ్ చేస్తూ.. బూతులు తిట్టుకుంటూ యుద్దాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.


హీరోలు, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అత్యంత విషపూరితమైన ఏరియా ఇది. కానీ.. వాళ్ళు దీంట్లోకి అసలు ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే కనీస  జ్ఞానం ఉన్నవారికి ఇప్పటికే సమాధానం తెలుస్తుంది. ఇది కేవలం ఒక హీరో వర్గానికి కాదు అందరి వర్గాలలోనూ ఉన్నారు. గత నెల అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు.. ఓ ప్రభాస్ ఫ్యాన్ మా హీరో అరెస్ట్ అయితే.. నైజాం ఏరియా తగలడిపోతుందని చక్కగా విజ్ఞాన ప్రదర్శన చేశాడు.

fanwarss_d13cb9e2f2.jpg

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2025 | 02:11 PM