Mega Sankranti festival: ఈసారి ఎవరికి వారే.. యమునా తీరే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:57 AM

తెలుగువారి పెద పండుగ సంక్రాంతి (Sankranti festival) అంటే మెగా ఫ్యామిలీలో (Mega Family) సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రతి ఏటా మెగా కుటుంబం మొత్తం కలిసి ఒక చోట సెలబ్రేట్‌ చేసుకునేవారు.

తెలుగువారి పెద పండుగ సంక్రాంతి (Sankranti festival) అంటే మెగా ఫ్యామిలీలో (Mega Family) సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రతి ఏటా మెగా కుటుంబం మొత్తం కలిసి ఒక చోట సెలబ్రేట్‌ చేసుకునేవారు. కుటుంబం మొత్తాన్ని చిరంజీవి (Chiranjeevi) ఒకే తాటిపైకి తీసుకొచ్చేవారు. ఊటీ, బెంగళూరులో ఉన్న ఫామ్‌హౌస్‌లో మూడు రోజులపాటు వైభవంగా మెగా ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ జరిగేవి. రెండు రోజుల ముందు ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకుని సందడిగా గడిపేవారు.  సురేఖ (Surekha) ఆధ్వర్యంలో వంటలు, మిగత టీమ్‌ ఆటలు, పాటలు చిరు అల్లర్లు ఇలా సందడిగా సాగేది. (Mega Family). కానీ ఈ సారి ఆ సందడి మిస్‌ అయింది.

CVhiru.jpeg

చిరంజీవి ఢిల్లీలో ప్రధాని మోడీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. రామ్‌చరణ్‌; ఉపాసన క్లీంకారతో కలిసి, అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో, వరణ్‌ తేజ్‌ లావణ్యతో, యంగ్‌ హీరోలు సాయిదుర్గతేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తమ స్నేహితులతో సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు. అయితే ఈసారి ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడివిడిగా పండుగను కానిచ్చేశారు. అయితే దీనికి కారణం.. హెడ్‌ ఆఫ్‌ ద హోం మెగాస్టార్‌ చిరంజీవి హైదరాబాద్‌లో లేకపోవడమా, లేక ఇరు కుటుంబాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వల్ల కామ్‌గా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 16 , 2025 | 10:57 AM