Mega X Allu: చిరు కోసం వెనక్కి తగ్గిన అరవింద్

ABN , Publish Date - Feb 11 , 2025 | 02:07 PM

మెగాస్టార్ చిరంజీవి కోసం అల్లు అరవింద్ వెనక్కి తగ్గాడు. . దీంతో మెగా, అల్లు మధ్యలో పోటీ ఏర్పడుతుంది అని భావించిన వాళ్ళు కంగుతింటున్నారు.

Chiranjeevi and Allu Aravind

కొన్ని రోజుల క్రితం వరకు మెగా, అల్లు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉందని లోకం భావించింది. అయితే తాజాగా నెలకొంటున్న పరిస్థితులు చూస్తే అన్ని చక్కదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'పుష్ప 2' సక్సెస్ ని చూసి గర్వపడుతున్న అని చిరు చెప్పగా.. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చరణ్ నా కొడుకు లాంటి వాడు, నా ఏకైక మేనల్లుడు అంటూ మెగాభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తాజాగా మరోసారి కూడా ఇలాంటి ఘటనే జరిగింది.


బ్రహ్మనందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మ ఆనందం' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. అయితే ఇదే సమయంలో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'తండేల్' సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. ఈ రెండు ఈవెంట్లు క్లాష్ అవుతున్న నేపథ్యంలో.. అల్లు అరవింద్ ఒక అడుగు వెనక్కి వేశారు. 'తండేల్' సినిమా సక్సెస్ ఈవెంట్ ను ఒక గంట ముందుకు జరపాలని టీమ్ ని ఆదేశించారు. దీంతో మెగా, అల్లు మధ్యలో పోటీ ఏర్పడుతుంది అని భావించిన వాళ్ళు కంగుతింటున్నారు.


విచారణకు ఆదేశం

మరోవైపు ‘తండేల్‌’ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. రెండో రోజున ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఛైౖర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 02:10 PM