Mega X Allu: ‘అల్లు’కున్న ‘మెగా’ బంధం..

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:39 PM

తాజా పరిస్థితులను చూస్తుంటే మరోసారి ‘మెగా’ బంధం ‘అల్లు’కుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, అమెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బీజాలు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

కొన్ని రోజులు క్రితం వరకు మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ సినీ అభిమానులను కలవరపెట్టింది. ఇరు ఫ్యామిలీలు మధ్య కాస్త దూరం పెరిగినట్లు కనిపించింది. దీంతో అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చెలరేగుతూ దారుణమైన ట్రోలింగ్స్ చేసుకున్నారు. కానీ.. తాజా పరిస్థితులను చూస్తుంటే మరోసారి ‘మెగా’ బంధం ‘అల్లు’కుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, అమెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బీజాలు వేస్తున్నట్లు కనిపిస్తుంది.


ఆదివారం విశ్వక్ సేన్ 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి.. అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఈ వేడుకలో మాట్లాడుతూ.. తెలుగు సినిమా హీరోలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.. మా ఫ్యామిలీలోను చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 'పుష్ప 2' సాధించిన సక్సెస్ ని నేను ఎంతో గర్వపడుతున్న అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఒక మెగా హీరో 'పుష్ప' ప్రస్తావన తీసుకురావడం అందరి సినీ అభిమానుల్లో సంతోషాన్ని కలుగజేసింది.


మరోవైపు తాజాగా నిర్వహించిన 'తండేల్' పైరసీ ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ' ఈ మధ్య ఓ ఈవెంట్‌లో నేను రామ్ చరణ్ స్థాయిని తగ్గించి మాట్లాడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నన్ను బాగానే ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి నేను దిల్ రాజు గారి పరిస్థితి చెప్పే క్రమంలో ఎలాంటి దురుద్దేశం లేకుండానే మాట్లాడాను. దీనికి కొందరు మెగాభిమానులు ఫీల్ అయ్యారు. చరణ్ నాకు కొడుకు లాంటి వాడు. నా ఏకైక మేనల్లుడు, నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య ఎక్స్‌లెంట్ రిలేషన్ షిప్ ఉంది. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి. ఎవరైనా ఫీలయితే సారీ" అన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 06:59 PM