Meenakshi chaudhary: మీనాక్షి చౌదరి క్రష్ ఎవరో తెలుసా..
ABN , Publish Date - Jan 20 , 2025 | 09:47 AM
Meenakshi chaudhary: ఒకవైపు కెరీర్, మరోవైపు రూమర్స్ వీటిపై మీనాక్షి చౌదరి ఎలా స్పందించింది. "టోటల్ క్లాస్ మొత్తం అతడ్ని ఇష్టపడేది. నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. అదే నా ఫస్ట్ క్రష్ అండ్ లవ్." అంటూ మీనాక్షి చెప్పిన లవ్ స్టోరీ ఏంటంటే..
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో హిట్టు అందుకొని వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే తను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచినప్పటి నుండి ఎవరో ఒక హీరోతో డేటింగ్ లో ఉందని, ఇంకో హీరోతో పెళ్లి అని ఎదో ఒక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ మీనాక్షి లైఫ్ లో లవ్ ఉందా? ఆమెకు ఎవరంటే ఇష్టం? వీటిపై ఆమె ఏమన్నారు అంటే..
తనపై వస్తున్న రూమర్స్ ని ఖండిస్తూనే మీనాక్షి తన లవ్ లైఫ్ గురించి చెప్పేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. " ప్రస్తుతం అయితే నా ఫోకస్ అంత సినిమాలపైనే ఉంది. స్కూల్ లేదా కాలేజీలో స్టూడెంట్స్ కు కచ్చితంగా టీచర్లపై క్రష్ ఉంటుంది. నాక్కూడా అలాంటిదే ఉంది. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా క్లాస్ లో ఓ టీచర్ అంటే చాలా ఇష్టం. టోటల్ క్లాస్ మొత్తం అతడ్ని ఇష్టపడేది. నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. అదే నా ఫస్ట్ క్రష్ అండ్ లవ్." అంటూ తన ఫస్ట్ క్రష్ ని రివీల్ చేసింది.
మాటలు కొనసాగిస్తూ.. " నాకు ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడేంత టైమ్ దొరకలేదు. మరీ ముఖ్యంగా మెడిసిన్ చదువు వల్ల ప్రేమకు పూర్తిగా దూరమయ్యాను. కాలేజీ లైఫ్ లో ఎలాంటి లవ్ లేదు. చదువుతోనే సరిపోయింది. పైగా మెడికల్ కాలేజీ కదా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ చదువే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరి ప్రేమలో పడలేదు. కెరీర్ పై మాత్రమే ఫోకస్ పెడుతూ వస్తున్నాను. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నకాబట్టి ప్రేమ, పెళ్ళికి టైమ్ ఉంది. ప్రస్తుతానికి సినిమాలే నా లోకం" అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.