Meenakshi chaudhary: ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ అంబాసిడర్‌ 

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:53 PM

లక్కీ భాస్కర్,  సంక్రాంతికి వస్తున్నాం   చిత్రలతో భారీ విజయాలను   తన ఖాతాలో వేసుకున్న హర్యానా బ్యూటీ మీనక్షో చౌదరి జాక్ పాట్  కొట్టేసింది 

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ (Women Empowerment Brand Ambassador)గా హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల వరస విజయాలతో ఈ హర్యానా బ్యూటీ  దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలోనూ మీనుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

వెంకటేష్ నటించిన ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  గతేడాది మహేశ్ బాబు 'గుంటూరు కారం', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్లో'నూ నటించి మెప్పించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభ‌ర'.. అలాగే "అన‌గ‌న‌గా ఒకరోజు" చిత్రంలోనూ మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దీంతో ఆమెను ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు సర్కార్ నియమించింది. 

Updated Date - Mar 02 , 2025 | 12:54 PM