Sundeep Kishan: 'మజాకా' సాంగ్ లైవ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్
ABN , Publish Date - Feb 17 , 2025 | 10:33 PM
'మజాకా' మూవీకి సంబంధించిన 'రావులమ్మా...' అనే పాటను మూడు రోజుల పాటు వికారాబాద్ లో చిత్రీకరించారు. చివరి రోజు పాట చిత్రీకరణను లైవ్ ద్వారా ఆడియెన్స్ కు చూపించారు మేకర్స్. ఇది తనకు కూడా సరికొత్త అనుభవమని హీరో సందీప్ కిషన్ తెలిపాడు
సందీప్ కిషన్ (Sandeep Kishan) నటిస్తున్న 30వ చిత్రం 'మజాకా' (Mazaka). రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను 'ధమాకా' ఫేమ్ త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. రీతువర్మ (Ritu Varma) హీరోయిన్ కాగా మరో జంటగా రావు రమేశ్ (Rao Ramesh), అన్షు (Anshu) నటించారు. ఈ మూవీకి సంబంధించిన 'రావులమ్మా...' అనే పాటను మూడు రోజుల పాటు వికారాబాద్ లో చిత్రీకరించారు. ఫిబ్రవరి 17 సోమవారం చివరి రోజు పాట చిత్రీకరణను లైవ్ ద్వారా ఆడియెన్స్ కు చూపించారు మేకర్స్. ఇది తనకు కూడా సరికొత్త అనుభవమని హీరో సందీప్ కిషన్ తెలిపాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న విడుదల చేయడం కోసం నెల రోజులుగా రాత్రి పగలు షూటింగ్ చేస్తున్నామని చెప్పాడు.
'సందీప్ కిషన్ లవ్లీ కో స్టార్' అంటూ హీరోయిన్ రీతువర్మ కితాబిచ్చింది. ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నట్టు చెప్పింది. ఇందులోని పాటలను ఆడియెన్స్ థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని ఆమె తెలిపింది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న 'రావులమ్మా'... 'మజాకా' చిత్రంలో రెండో మాస్ సాంగ్ అని చెప్పారు దర్శకుడు త్రినాధరావు నక్కిన. మూడు రోజుల కిత్రం భారీ సెట్ లో ఈ పాట చిత్రీకరణను ప్రారంభించామని, హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, రీతూ వర్మ ఈ ఫోక్ సాంగ్ కు అద్భుతంగా స్టెప్పులేశారని, థియేటర్లలో విజిల్స్ ఖాయమని ఆయన అన్నారు. అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరిన సినిమా ఇదని, ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని నిర్మాత అనిల్ సుంకర, రాజేశ్ దండా ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాత్రి కానుకగా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందని రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పారు.