Sundeep Kishan: 'మజాకా' నుండి వచ్చిన మాస్ డాన్స్ నంబర్

ABN , Publish Date - Feb 18 , 2025 | 07:03 PM

'మజాకా' మూవీని నుండి 'పగిలి' అనే మాస్ డాన్స్ నంబర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చాడు. కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాటను రాశారు. ఈ సాంగ్ లో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ మాస్ డాన్స్ మూమెంట్ అదిరిపోతాయని మేకర్స్ చెబుతున్నారు.

సందీప్ కిషన్ నటించిన 'మజాకా' మూవీ శివరాత్రి కానుకగా ఈ నెల 26న జనం ముందుకు రాబోతోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దీనిని అనిల్ సుంకరతో కలిసి రాజేశ్‌ దండా నిర్మిస్తున్నాడు. రీతువర్మ హీరోయిన్. రావు రమేశ్‌, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్ట్ ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ తో ఉంటుందని, హెల్తీ కామెడీతో అన్ని వర్గాలను అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.


తాజాగా 'మజాకా' మూవీని నుండి 'పగిలి' అనే మాస్ డాన్స్ నంబర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చాడు. కాసర్ల శ్యామ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాటను మహాలింగం, సాహితీ చాగంటి, ప్రభ పాడారు. ఈ సాంగ్ లో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ మాస్ డాన్స్ మూమెంట్ అదిరిపోతాయని మేకర్స్ చెబుతున్నారు. మ్యాసీవ్ అండ్ వైబ్రెంట్ సెట్స్ లో ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్, సెకండ్ సింగిల్ బేబీ మా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు: ప్రసన్నకుమార్ బెజవాడ.

Updated Date - Feb 18 , 2025 | 09:24 PM