Mastan Sai: బాంబ్ పేల్చిన మస్తాన్ సాయి..
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:00 AM
మస్తాన్ సాయి.. ప్రస్తుతం చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు నుండి రాజ్ తరుణ్, లావణ్య కేసులో సంచలన వీడియోలతో పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా మస్తాన్ సాయి వీడియోల గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రాజ్ తరుణ్, లావణ్య కేసులో సోమవారం మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతని దగ్గర హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 200పైగా వీడియోలను గుర్తించినట్లు సమాచారం. మరి ఆ వీడియోలో ఉన్నది ఎవరు? ఎలా రికార్డ్ చేశారని పలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. కాగా, ఆ వీడియోలలో నన్ను అత్యాచారానికి గురి చేసిన వీడియో ఉందని లావణ్య ఫిర్యాదు చేసింది. అలాగే పలువురు యువతులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి.. అశ్లీల వీడియోలను రికార్డ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ తారల వీడియోలు కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న వేళా.. మస్తాన్ సాయి స్పందించాడు.
నార్సింగ్ పోలీసుల విచారణలో మస్తాన్ సాయి నోరు విప్పుతూ.. 'వాటిలో ఉన్నది మరెవరో కాదు , నా భార్య, కొన్ని వీడియోల్లో గాళ్ ఫ్రెండ్ ఉంది. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించాను . ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి.. వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని' ఆరోపించాడు.
రాజ్ తరుణ్ -- లావణ్య కేసు ఏంటి?
‘‘పదకొండేళ్లగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రా తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్ నాకు కావాలి’’ అంటూ లావణ్య అప్పట్లో మీడియా ముందుకు వచ్చింది. రాజ్‌తరుణ్ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్. లావణ్యతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ప్రస్తుతం మస్తాన్ సాయి తెరపైకి వచ్చాడు.