Mastan Sai: పోలీసుల దూకుడు.. పరారీలో నిందితులు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:17 PM
మస్తాన్ సాయి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలకు సంబంధించిన వీడియోలో బయటకు వచ్చాయి. అందులో చాలా మంది యువతీయువకులు పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ వ్యహారంపై రంగంలోకి దిగారు.
మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులోకి నార్కోటిక్స్ పోలీసులు ఎంటర్ అయ్యారు . విచ్చలవిడిగా డ్రగ్స్ వీడియోలు వైరల్‌గా మారడంతో నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌ల్లో డ్రగ్స్ వాడకం వీడియోలు భారీగా లభించినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. తాజాగా వీరితో పాటు పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలను నార్కోటిక్స్ పోలీసులు సేకరిస్తున్నారు.
ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ఎక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఎంత మంది పాల్గొన్నారు అనే అంశాలపై పోలీసులు ఫొకస్ పెట్టారు. ఇప్పటికే గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీ వీడియోలో ఉన్న వారందరూ పరారయ్యారు. మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు నిఘా పెంచారు. నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. యువతులను ట్రాప్ చేసి వారి నగ్న వీడియోలు చిత్రీకరించిన తర్వాత వాళ్లను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలకు సంబంధించిన వీడియోలో బయటకు వచ్చాయి. అందులో చాలా మంది యువతీయువకులు పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ వ్యహారంపై రంగంలోకి దిగారు.
ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాలో నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది అబ్బాయిల వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. వారాంతంలో మస్తాన్ సాయి ఇంట్లోనే డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడు. అయితే వీడియోలు బహిర్గతం అవడంతో అందులో ఉన్న వారు పరారీలో ఉన్నారు. వారి మొబైల్స్‌ను స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది సార్ల వరకు జరిగిన డ్రగ్స్ పార్టీల వీడియోలు బయటకు వచ్చాయి. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయిని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.