Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

ABN , Publish Date - Jan 26 , 2025 | 11:51 AM

‘మనదే ఇదంతా’.. రవితేజ సినీ కెరీర్‌లో చిర స్థాయిగా నిలిచిపోయే డైలాగ్. ఇప్పుడిదే డైలాగ్ మరోసారి మాస్ రాజా ప్రేక్షకులకు ‘మాస్ జాతర’ని ఇవ్వబోతుంది. అర్థం కాలేదా! జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Mass Maharaaj Ravi Teja in Mass Jathara

ఒకే ఒక్క డైలాగ్.. ‘మనదే ఇదంతా’. ‘మాస్ జాతర’ గ్లింప్స్‌లో రవితేజ చెప్పిన డైలాగ్. ఇంక డైలాగ్స్ ఏమీ లేవు.. అంతా మాస్ ర్యాంపేజ్ అంతే. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రచార చిత్రాలు మంచి స్పందనను రాబట్టుకోగా.. రిపబ్లిక్ డే అలాగే రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘మాస్ జాతర’ గ్లింప్స్ వదిలారు.


Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను ఈ గ్లింప్స్ గుర్తు చేస్తోంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు ఈ మాస్ రాజా. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. డైలాగ్స్ ఆటోమ్యాటిగ్గా పెదవులపై ఆడుతుంటాయి. అలాంటి రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే మరో విందు భోజనం లాంటి మాస్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ రూపంలో రాబోతుందని ఈ గ్లింప్స్‌ను చూస్తే తెలుస్తోంది.


Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్

రవితేజ సినీ ప్రస్థానంలో ‘మనదే ఇదంతా’ అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్లింప్స్‌‌కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకెళ్తూ.. నేటితరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా ‘మాస్ జాతర’ గ్లింప్స్‌ ‘మాస్ ర్యాంపేజ్’ అనేలా మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్‌ మరోసారి రుజువు చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా ఉంది. మొత్తంగా అయితే.. ఈ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. రవితేజ సరసన ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


Mass-Jathara.jpg

Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 11:51 AM