Mani Sharma: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మణిశర్మ రక్తదానం!
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:04 PM
సాధారణ ప్రజలు, చిరంజీవి అభిమానులే కాదు... సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేస్తుంటారు. కొంతమంది తమ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి రక్తదానం చేసిన సంఘటనలూ ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వెండితెరపై నటనతో అలరించడమే కాదు... ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆపన్నులను సైతం ఆదుకుంటూ ఉంటారు. దాని ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేస్తుంటారు. లక్షలాదిమంది అభిమానుల రక్తదానంతోనే ఈ బృహుత్ కార్యాన్ని నిర్వహిస్తున్నానని చిరంజీవి చెబుతుంటారు. విశేషం ఏమంటే... సాధారణ ప్రజలు, చిరంజీవి అభిమానులే కాదు... సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు (Chiranjeevi Blood Bank) రక్తదానం చేస్తుంటారు. కొంతమంది తమ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి రక్తదానం చేసిన సంఘటనలూ ఉన్నాయి.
తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma Blood Donation) రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ‘‘ఎప్పటి నుంచో రక్త దానం చేయాలని అనుకుంటున్నాను. నేను నా సంగీతాన్ని చిరంజీవిగారి సినిమాలకు అందించటం ద్వారా అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం అనేది సంతోషంగా ఉంది. ఇది నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమయ్యారు. అందులో నేను ఒక బొట్టులాగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’’ అన్నారు. Music Director Mani Sharma)
చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి ఈ మహత్కార్యంలో భాగమై రక్తదానం చేసిన మణిశర్మకు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. పాటలకు స్వరాలు కూర్చడమే కాదు.. మానవత్వానికి చిరునామాగా నిలవడమూ తెలుసునని మణిశర్మ నిరూపించారని కొనియాడారు.