Payal Rajput: పాయల్ 'అన్‌ప్రిడిక్టబుల్' ప్లాన్
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:14 PM
Payal Rajput: మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేనంత పర్ఫామెన్స్ ఇయ్యనుందట. ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ కానుంది? మేకర్స్ ఎవరంటే..
'RX 100' మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్‌పుత్. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత "మంగళవారం" మూవీ సూపర్ హిట్ తో పాయల్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేనంత పర్ఫామెన్స్ ఇవ్వనుంది అంటున్నారు.
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నం. 1' చిత్రం సిద్ధం కాబోతుంది. డైరెక్టర్ 'ముని' కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారు.
‘ఆర్‌ఎక్స్ 100’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ రాజ్‌పుత్. తదుపరి ‘వెంకీమామ’, ‘ఆర్‌డీఎక్స్ లవ్’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. గత సంవత్సరం ఆమె నటించిన ‘రక్షణ’. ‘గోల్‌మాల్’, ‘ఏంజెల్’, ‘కిరాతక’ చిత్రాలు మిశ్రమ స్పందనను పొందాయి.