Mangalavaaram 2: ‘అక్రమ సంబంధాలు ఉంటే చంపేస్తారు’

ABN , Publish Date - Feb 05 , 2025 | 10:59 AM

ఉద్వేగంతో కూడిన కథ, మతిపోయే ట్విస్టులు, ఒళ్ళు జలదరించేలా నేపథ్య సంగీతం, విజువల్స్ తో అందరి మతిపోగోట్టిన “మంగళవారం” మూవీ మేకర్స్ నుండి అద్భుతమైన అప్డేట్ వచ్చింది.

Mangalavaaram 2 Update

గ్లామర్ తార పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) లీడ్ రోల్‌లో నటించిన “మంగళవారం” (Mangalavaaram) సినిమా 2023లో విడుదలై సక్సెస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా మేకర్స్ నుండి మరో సూపర్ డూపర్ అప్డేట్ వచ్చింది.


ఉద్వేగంతో కూడిన కథ, మతిపోయే ట్విస్టులు, ఒళ్ళు జలదరించేలా నేపథ్య సంగీతం, విజువల్స్ వల్ల ఈ చిత్రం చూసిన కొన్ని రోజుల తర్వాత కూడా మనసుని వదలలేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం-2కు రంగం సిద్ధం చేశారు మేకర్స్. డైరెక్టర్ అజయ్ భూపతి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశారట. త్వరలోనే పట్టాలెక్కించనున్నారట. అయితే ఈ సినిమా 'మంగళవారం' సినిమాకి సీక్వెల్ కాదట ప్రీక్వెల్ అని తెలుస్తోంది. ఈ సినిమా బజ్ ని దృష్టిలో పెట్టుకొని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా మేకింగ్ లో భాగస్వామ్యం అయ్యిందట.

Untitled-4 copy.jpg


ఇక మంగళవారం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలో మంగళవారం రోజు ఇద్దరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతూ వుంటారు. అలా పోయినవాళ్ల గురించి ఆ ఊరి గోడ మీద వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవరో రాస్తూ వుంటారు, అందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని గ్రామ ప్రజలు కూడా నమ్ముతూ వుంటారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై (నందితా శ్వేత) మాత్రం అవి ఆత్మ హత్యలు అంటే నమ్మదు, అందుకని వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించాలని అంటుంది. కానీ ఆ ఊరి జమీందారు ప్రకాశం జమీందారు ప్రకాశంబాబు (చైతన్య కృష్ణ) పోస్ట్ మార్టంకి ఒప్పుకోడు. రెండో సారి ఇద్దరూ చనిపోయినప్పుడు ఎస్.ఐ ఆ శవాలని పోస్ట్ మార్టంకి పంపిస్తుంది, ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆ ఊరి ప్రజలు జట్లు జట్లుగా చీలిపోయి ఎవరు ఇలా గోడమీద రాస్తున్నారు, ఎవరు హత్యలు చేయిస్తున్నారో తెలుసుకుందామని రాత్రిపూట గస్తీ తిరుగుతూ వుంటారు. ఇంతకూ ఆ గోడ మీద రాస్తున్నది ఎవరు? ఎందుకు మంగళవారమే ఆ హత్యలు జరుగుతున్నాయి? ఆ ఊరి నుండి వెలివేయబడిన శైలూ (పాయల్ రాజపుత్) కి ఈ హత్యలకు సంబంధం ఏమైనా ఉందా? జమీందారు దేవుడిని నమ్మడు, కానీ అతని భార్య (దివ్యా పిళ్ళై) ఆ వూర్లో అమ్మవారి జాతరకు అయ్యే ఖర్చు ఇస్తూ ఉంటుంది, ఆమె పాత్ర ఏంటి? శైలు చిన్నప్పటి స్నేహితుడు రవి చనిపోయాడా, బతికున్నాడా? అసలు ఈ మిస్టరీ ఏంటి అనేది 'మంగళవారం' కథ.

Updated Date - Feb 05 , 2025 | 11:04 AM