Manchu Vishnu: హ్యాట్సాఫ్ మంచు విష్ణు..
ABN , Publish Date - Jan 26 , 2025 | 08:32 PM
Manchu Vishnu: "పలు విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అనాథలను, గవర్నమెంట్ స్కూల్స్ ని దత్తతు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ డే నేపథ్యంలో మంచు విష్ణు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు"
ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోల్ అయ్యే ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. అలాగే సేవ కార్యక్రమాల్లో కూడా ముందు ఉండే ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. ముఖ్యంగా మంచు విష్ణు.. తన పేరు మీదే ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ చేసి అనేక సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అనాథలను, గవర్నమెంట్ స్కూల్స్ ని దత్తతు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ డే నేపథ్యంలో మంచు విష్ణు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే..
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి విష్ణు ప్రో ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. "ఇప్పటినుండి మోహన్ బాబు యూనివర్సిటీ.. తెలుగు వారైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు 50 శాతం స్కాలర్‌షిప్ అందిస్తుందని" విష్ణు ప్రకటించాడు . అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగువారికి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వర్తిస్తుందని పేర్కొన్నాడు. యూనివర్సిటీలో ఏ కోర్స్ చదవాలన్న ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.
Also Read- Padma Awards: టాలీవుడ్‌లోని నటులకు ఏ ఏజ్‌లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయంటే..
మరోవైపు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో పాటు మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.