Manchu Vishnu: ‘శివ శివ శంకరా’ మార్మోగిపోతోంది
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:51 PM
మంచు విష్ణు (Manchu Vishnu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం మంచి విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు విష్ణు తెలిపారు.
మంచు విష్ణు (Manchu Vishnu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం మంచి విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు విష్ణు తెలిపారు.
ఈ సినిమా నుంచి వచ్చిన ‘శివా శివా శంకరా’ (Siva Siva Shankara) అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉందాని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ఈ పాటను 80 మిలియన్ల (8 కోట్ల) మంది వీక్షించారు. రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతోంది.
విష్ణు మంచు మాట్లాడుతూ.. ’శివా శివా శంకరా’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థం అవుతోంది’ అని అన్నారు.
ఇందులో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా.. రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.