Manchu Vishnu: అక్షయ్ కుమార్ .. శివుడు.. విష్ణు ఏమన్నాడంటే..

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:20 PM

"శివుడి గురించి ఈ తరంలో ఎవరు ఆలోచించినా అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) రూపమే గుర్తుకువస్తుందన్నారు" మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకుడు.

"శివుడి గురించి ఈ తరంలో ఎవరు ఆలోచించినా అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) రూపమే గుర్తుకువస్తుందన్నారు" మంచు విష్ణు. ఆయన నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకుడు. ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా  నటిస్తున్నారు. ఏప్రిల్‌ 25న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌ శివుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియా కోసం ప్రత్యేకంగా హిందీ టీజర్‌ను లాంఛ్‌ చేశారు.


Akshay.jpg

‘‘నేను మోహన్‌బాబు కుమారుడిని అని చెప్పడానికి గర్వపడతాను. ఆయన లేకపోతే నేను నటుడిని అయ్యేవాడిని కాదు. నాన్న కారణంగానే అక్షయ్‌ కుమార్‌ కూడా ఈ చిత్రంలో నటించారు. చిత్రీకరణ సమయంలో అక్షయ్‌ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఈ చిత్రీకరణ ప్రారంభం అయ్యాక నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నతంగా ఆలోచిస్తున్నా. మోహన్‌లాల్‌, ప్రభాస్‌ అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ తరంలో శివుడు అంటే మొదట గుర్తుకువచ్చే పేరు అక్షయ్‌కుమారే’’ అని విష్ణు (Manchu Vishnu) చెప్పారు.

‘కన్నప్ప’ కథను రెండుసార్లు రిజెక్ట్‌ చేసినట్లు అక్షయ్‌ కుమార్‌ చెప్పారు. విష్ణు, మోహన్‌బాబు ఎన్నోసార్లు ఫోన్‌ చేశారని కానీ, బిజీగా ఉండడంతో మాట్లాడలేకపోయానని అన్నారు. ఒక సారి ఆఫీసుకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే అంగీకరించానని  చెప్పారు.  

Updated Date - Feb 27 , 2025 | 04:24 PM