Manchu Manoj: మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 07:39 PM
Manchu Manoj: తాజాగా మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పరోక్షంగా దారుణంగా విరుచుకుపడ్డాడు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేస్తూ .. "కృష్ణం రాజు గారిలాగా సింహం అవ్వాలని అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది..
మంచు కుటుంబంలో మంటలు ఆరడం ఏమో కాని ఎగిసి ఎగిసి పడుతున్నాయి. తాజాగా మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పరోక్షంగా దారుణంగా విరుచుకుపడ్డాడు. ఆయన తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేస్తూ .. "కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారిలాగా సింహం అవ్వాలని అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్" అని రాస్తూ కృష్ణంరాజు నటించిన తాండ్రపాపారాయుడు, భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను షేర్ చేశాడు. #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి.. ఆయన హాలీవుడ్ ప్రాజెక్టు అనేది క్లూ అంటూ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడో క్లియర్ గా మెన్షన్ చేశాడు.
అయితే అంతకు మంచు విష్ణు.. మోహన్ బాబు ‘రౌడీ’ చిత్రంలోని ‘‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ’’ అనే డైలాగ్ షేర్ చేశాడు. ఇది పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే మనోజ్ ఈ పోస్టు పెట్టడం విశేషం. కొందరు మొదట విష్ణు.. మనోజ్ ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడని భావిస్తున్నారు.
తాజాగా మనోజ్ మరో పోస్ట్ పెట్టారు.