Raj Tarun - Lavanya Case: లావణ్య రాజ్ తరుణ్ కేసులో వ్యక్తి అరెస్ట్.. ఎవరంటే
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:23 PM
Raj Tarun - Lavanya Case: లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా నార్సింగ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నార్సింగ్ పోలీసులు లావణ్య సమర్పించిన ఆధారాల మేరకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతకు ముందే ప్రముఖ కేసులో ఈ వ్యక్తి అరెస్ట్ కావడం గమనార్హం. కాగా, ఈ వ్యక్తి రాజ్ తరుణ్, లావణ్య విడిపోవడానికి ప్రధాన కారణమని లావణ్య తెలిపింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏం చేశాడంటే..
మస్తాన్ సాయి.. గచ్చిబౌలి, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా అరెస్టైన వ్యక్తి. ఇప్పడు లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరోసారి నార్సింగ్ పోలీసుల చేతికి చిక్కాడు. ఈ కేసు గురించి పోలీసుల వద్ద లావణ్య ప్రస్తావిస్తూ.. రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయి ప్రధాన కారణమని తెలిపింది. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ పై ఆరోపణలు వచ్చాయి. అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను మస్తాన్ రికార్డ్ చేశాడు. దీంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి వద్ద 200పైగా వీడియోలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే..
‘‘పదకొండేళ్లగా రాజ్ తరుణ్ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. అతనిప్పుడు నన్ను వదిలేసి మాల్వీ మల్హోత్రా తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు.. నా రాజ్ నాకు కావాలి’’ అంటూ లావణ్య అప్పట్లో మీడియా ముందుకు వచ్చింది. రాజ్‌తరుణ్ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్. ఇలా మొదలైన ఈ ఇష్యూ ట్విస్ట్‌లతో ఓ టీవీ సీరియల్ లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.