Mahesh Babu: మహేష్ బాబుకు హీరోయిన్ దొరికేసిందా..
ABN , Publish Date - Jan 09 , 2025 | 07:32 AM
Mahesh Babu: ఇప్పటికే అనధికారికంగా మహేష్ బాబు, రాజమౌళిల సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇతర కాస్టింగ్ విషయాలు ఇంకా బయటకు రాలేదు. కానీ.. మహేష్ షూటింగ్‌లో ఓ హీరోయిన్ కనిపించింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా 'SSMB29' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సైలెంట్‌గా ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీంతో అందరు సంతోషించిన ఇతర కాస్ట్ విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఓ షూటింగ్ స్పాట్‌లో కనిపించాడు. ఆయనతో పాటు హీరోయిన్ కూడా ఉంది.
మహేష్ బాబు, జక్కన సినిమాలపై కేవలం తెలుగు స్టేట్స్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కాస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, తాజాగా మహేష్ ఓ షూటింగ్ లో కనిపించాడు. ఆ షూట్ లోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మహేష్ షూట్ లో తమన్నా పాల్గొనడం ఏంటని అనుకున్నారు. అయితే ఈ షూట్ రాజమౌళి సినిమాది కాదు. ఇటీవలే మహేష్ బ్రాండ్ అంబాసిడర్ కమ్ పార్ట్నర్‌గా స్టార్ట్ చేసిన సోలార్ కంపెనీ 'ట్రూ జోన్ సోలార్'కు సంబంధించిన యాడ్ షూట్ గా తెలిసింది.
మరోవైపు 'SSMB29 విషయానికొస్తే.. ఈసారి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌కి చాలా టైమ్ తీసుకున్నారు. ప్రొడక్షన్ మాత్రం చక చక పూర్తి చేయాలన్నది ఆయన ప్లాన్. నిజానికి లాక్ డౌన్ లేకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా చాలా త్వరగా పూర్తయ్యేది. కరోనా వల్ల ఆ సినిమా లేటయింది. 2026 చివర్లో మహేష్ ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్. అయితే ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పడం లేదు. ఎందుకంటే ఓ రిలీజ్ డేట్ చెప్పడం, అది చేయి జారిపోవడం, మరో రిలీజ్ డేట్ ప్రకటించడం.. ఇలా కన్‌ఫ్యూజన్ సృష్టించడం జక్కన్నకు ఇష్టం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’కు రిలీజ్ డేట్లు చాలా మారాయి. ఈ సారి అలా కాకుండా ఉండాలనుకుంటున్నారు జక్కన్న. అంతే కాదు వీలైనంత లో ప్రొఫైల్‌గా ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు.రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టినా ప్రెస్ మీట్ పెట్టి కథేంటో చెప్పడం అలవాటు. ఈ సారీ అదీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టేశారు.