Robinhood: మహేష్ బాబు వదిలిన  'రాబిన్‌హుడ్‌' లవ్లీ & పెప్పీ బ్రాండ్ సాంగ్ 

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:34 PM

నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుములు (Venku kudumula) దర్శకత్వం వహించిన  'రాబిన్‌హుడ్‌' (Rabinhood) చిత్రం   ఈ సినిమా 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటించింది.

నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుములు (Venku kudumula) దర్శకత్వం వహించిన  'రాబిన్‌హుడ్‌' (Rabinhood) చిత్రం   ఈ సినిమా 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది.  వాలెంటైన్స్ డే సందర్భంగా, ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ -వేర్‌ ఎవర్ యు గో సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ పాట కోసం ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. బ్రాండ్‌ల క్రియేటివ్ మిక్స్, వాటి ఐకానిక్ ట్యాగ్‌లైన్‌ల ద్వారా హీరో హీరోయిన్ పట్ల ఉన్న  ప్రేమను వ్యక్తపరుస్తాడు.

"జివి ప్రకాష్ కుమార్ మెలోడీతో ఎక్సయిటింగ్ ట్రాక్‌ను అందించారు. అర్మాన్ మాలిక్  వోకల్స్ అందాన్ని మరింత పెంచింది. ఈ ప్రేమ పాటను రాయడంలో సవాలును స్వీకరించి, బ్రాండ్‌లను, వాటి ట్యాగ్‌లైన్‌లను చాలా తెలివిగా ప్రజెంట్ చేసిన కృష్ణకాంత్‌కు స్పెషల్ క్రెడిట్ దక్కుతుంది. నితిన్ పాటకు హై ఎనర్జీ తీసుకొచ్చారు.  శ్రీలీల తన అందంతో కట్టిపడేసింది. వారి కెమిస్ట్రీ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. విజువల్స్,ఎనర్జిటిక్ సెట్స్ మెస్మరైజ్ చేశాయి. వాలెంటైన్స్ డే కి ఇది పెర్ఫెక్ట్ సాంగ్ అని మేకర్స్ అన్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. కోటి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 

Updated Date - Feb 14 , 2025 | 11:42 PM