Mahesh For Venkatesh: సంక్రాంతి పార్టీలో మహేశ్‌ సందడి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:42 AM

వెంకటేశ్‌, మహేశ్‌ మధ్య ఉన్న బాండింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి చిన్నోడు, పెద్దోడుగా ఆ పేర్లు స్థిరంగా ఉండిపోయాయి. ఏ వేదికపై కనిపించినా అదే పేర్లతో అభిమనులు పిలుచుకుంటారు.

వెంకటేశ్‌(Venkatesh), మహేశ్‌ మధ్య ఉన్న బాండింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి చిన్నోడు, పెద్దోడుగా ఆ పేర్లు స్థిరంగా ఉండిపోయాయి. ఏ వేదికపై కనిపించినా అదే పేర్లతో అభిమనులు పిలుచుకుంటారు.

Sv2.jpgఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్‌గా ఉంటారు. తాజాగా వెంకటేశ్‌ అండ్‌ టీమ్‌తో కలిసి మహేశ్‌ (Mahesh Babu Family) కుటుంబం సరదాగా గడిపింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలై మంచి టాక్‌ దక్కించుకుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankarthiki VastunnaM) సినిమా. ఈ సందర్భంగా టీమ్‌ ఏర్పాటు చేసిన పార్టీలో మహేశ్‌బాబు పాల్గొన్నారు.

SV4.jpgచిత్ర బృందంతో ఆయన కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో కలిసి నటించిన మహేశ్‌- వెంకటేశ్‌ పాత్రలను ఉద్దేశిస్తూ ఓకే ఫ్రేమ్‌లో ‘చిన్నోడు- పెద్దోడు’ అదుర్స్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌, నిర్మాత సురేశ్‌బాబు, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్‌ తదితరులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు.  

SV.jpg

ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని మహేశ్‌బాబు ఇటీవల ట్వీట్‌ చేశారు. ఇది అసలైన పండగ సినిమా అని పేర్కొన్నారు. వెంకటేశ్‌, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు పాత్ర పోషించిన బాలుడి నటన అద్భుతమని ఆయన పేర్కొన్నారు. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు రాబట్టింది. 

Updated Date - Jan 18 , 2025 | 07:42 AM